calender_icon.png 19 May, 2025 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇస్లామిక్ స్మశానవాటికను పునర్ నిర్మించాలి

05-04-2025 12:00:00 AM

అంతర్జాతీయ షియా పండితుడు నజాఫ్ ఇరాక్ విజ్ఞప్తి

ముషీరాబాద్, ఏప్రిల్ 4: (విజయక్రాంతి) : సౌదీ అరేబియాలోని మదీనాలో ఉన్న పురాతన ఇస్లామిక్ స్మశానవాటిక (జన్నత్-ఉల్-బాకీ)ని పునర్ నిర్మించాలని అంతర్జాతీయ షియా పండితుడు నజాఫ్ ఇరాక్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ప్రధా ని నరేంద్ర మోడీ, కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజులకు లేఖలు పంపుతామని తెలిపారు. ఈ మెరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ స్మశానవాటికలో సుమా రు 7 వేల మంది ఇస్లామిక్ ప్రముఖులను ఖననం చేశారన్నారు.

ముఖ్యంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం కుటుంబం, అనుచరులు సమాధి చేయబడ్డారన్నారు. జన్నత్-ఉల్-బకీని 1926 లో వహాబీ సౌదీ పాలకులు కూల్చివేశారన్నారు. భారత్లోని సౌదీ అరేబియా రాయ బారితో చర్చ లు ప్రారంభించాలన్నారు. ఐకాస సంస్థ తో జన్నత్-ఉల్-బాకీని పునర్నిర్మించే విషయాన్ని చేపట్టాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఐక్యరాజ్యసమితి అన్ని చారిత్రక ఇస్లామిక్ ప్రదేశాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా చేయాలన్నారు.

మహమ్మద్ ప్రవక్త కుమార్తె హజ్రత్ బీబీ ఫాతిమా-తుస్-జెహ్రా(లు) కొంతమంది ఇమామ్లు, ఇమామ్ హసన్, ఇమామ్ జైన్-ఉల్-అబిదీన్, ఇమామ్ మొహమ్మద్ బాకర్, ఫాబిన్-ఇమామ్, అసద్-ఇమామ్ అలీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల్లి, మేనమామలు అక్కడ ఖననం చేయబడ్డారన్నారు. ఈ సమావేశంలో మౌలానా షేక్ మొహమ్మద్ అబ్బాస్ పంజు, మౌలానా సయ్యద్ మొహెబ్బే అబేద్, మౌలానా సయ్యద్ ఫయాజ్ హుస్సేన్, మీర్ ఫిరాసత్ అలీ బక్రీ, సయ్యద్ అలీ హుస్సేన్ జైదీ, మీర్ రజా అలీ సోహైల్ పాల్గొన్నారు.