calender_icon.png 19 May, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి

04-04-2025 11:59:17 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో ని శ్రీ సీతాసీతారామ చంద్ర స్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించనున్న సీతారాముల కల్యాణానికి ఏర్పాటు పూర్తి చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామ పురోహితులు సంజీవ రావు పంతులు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఆదివారం ఉదయం 11 గంటలకు సీతారాముల కళ్యాణం, అనంతరం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని, సోమవారం నాడు కుస్తీ పోటీలు,రాత్రికి రథోత్సవం నిర్వహిస్తామని కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని గ్రామపెద్దలు పేర్కొన్నారు.