03-01-2026 12:25:57 AM
కుషాయిగూడ, జనవరి 2 (విజయక్రాంతి) :వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కాప్రా సర్కిల్ డా. ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచాయి.
సంప్రదాయ కళారూపమైన కూచిపూడి నృత్యాల ద్వారా స్వామివారి లీలలు, పురాణ ఇతిహాస ఘట్టాలను ఆవిష్కరిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్య అతిథులుగా ఉమా-ప్రకాష్ రావు, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ పీఏ, ఓఎస్డీ పరమేష్ శ్వర్-నీరజ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి నృత్య కార్యక్రమాన్ని ప్రారంభించారు.