03-01-2026 12:25:29 AM
ఉప్పల్, జనవరి 2 (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం లోని నాచారం డివిజన్లోని పాస్టర్లు బిఆర్‌ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్ నివాసంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్ డివిజన్లోని క్రైస్తవులందరినీ ఏకం చేసి కలిసికట్టులా ఉండేలా చేశారని వారు తెలియ జేశారు. అనంతరం ప్రేయర్ చేసి శేఖర్ ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ శ్యామ్సన్ లాజర్స్ ఏలియా స్వామి అభిషేక్ ప్రవీణ్ పాల్గొన్నారు