06-01-2026 01:21:38 AM
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి) : శాసన సభా, శాసన మండలి సమావేశాలు మంగళవారానికి వాయిదాపడ్డాయి. శాస నసభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులుకు ఆమోదం లభించింది. తెలంగాణ విశ్వవిద్యా లయాల, జీఎస్టీ సవరణ బిల్లులపై సభలో చర్చించి ఆయా బిల్లులకు సభ్యులు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సభ్యులు సూచించారు. అంతకు ముందు బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు.
శాసన మండలిలో తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్, పబ్లిక్ సర్వీసెస్, తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లు బిల్లులు ఆమోదం పొందాయి. అంతకు ముందు రోజు అసెంబ్లీలో ఈ బిల్లులు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. మంగళవారం అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చించనున్నారు. బుధవారం ప్యూచర్ సిటీపై చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.