09-01-2026 03:39:13 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): యాసంగి పంటల నిమిత్తం కోసం మండలంలోని పోచారం ప్రాజెక్టు నీటి విడుదల చేశారు. ఇరిగేషన్ ఎస్సీ ఎస్ఎస్ శ్రీ, డిఈఈ వెంకటేశ్వర్లు, ఆర్డీవో పార్థసింహారెడ్డి ప్రధాన గేట్ల వద్ద ప్రత్యేక పూజలు చేసి పోచారం ప్రధాన కాలువ ద్వారా నీటిని దిగకు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పోచారం ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న పంటల నిమిత్తం కోసం నీటిని విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కావున పోచారం ప్రాజెక్టు ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని నీటిని వృధా చేయకూడదు అన్నారు. పోచారం ప్రధాన కాలువ వెంబడి కరెంటు మోటార్లు పెట్టి నీటిని వృధా చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకొని కరెంటు మోటార్లను సీజ్ జరుగుతుందన్నారు.