calender_icon.png 4 December, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ బూత్ లో ఓటర్ల జాబితా తప్పకుండా ప్రదర్శించాలి

09-11-2024 04:12:45 PM

వనపర్తి (విజయక్రాంతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం-2025లో భాగంగా శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపైన్ డేస్ లో ప్రతి పోలింగ్ బూత్ లోను ఓటర్ల జాబితా తప్పకుండా ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం జిల్లాకేంద్రంలోని మర్రికుంఠలోని 179, బండారు నగర్ లోని 153, 155, 156, ఇందిరానగరలోని 117 పోలింగ్ బూత్ లను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని పోలింగ్ బూత్ లలో ఓటర్ జాబితాలను తప్పక ప్రదర్శించాలని బీఎల్ఓలను ఆదేశించారు.

ఓటర్ జాబితాలో డబల్ ఓట్లు ఉంటే వాటిని ఫారం-7 ద్వారా తొలగించాలని, మార్పులు ఏమైనా ఉంటే ఫారం-8 ద్వారా చేయాలని సూచించారు. 1-1-2025 నాటికి 18 ఏళ్ళు నిండిన యువత ఎవరైనా కొత్తగా ఓటర్ గా నమోదు చేసుకోవలనుకుంటే ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచని, ఇందుకోసం బీఎల్ఓ లు ఇపుడు అందుబాటులో ఉంటారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎవరైనా ఓటర్లు మరణించిన పక్షంలో వారిని జాబితా నుంచి తొలగించాలని సూచించారు. బీఎల్ఓ అప్లికేషన్ ద్వారా సవరణలు చేయాలన్నారు. ఆర్డివో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రమేష్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ పూర్ణ చందర్, బీఎల్ఓ లు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.