26 June, 2026 | 6:46 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

ఒంటరి పాట

11-05-2026 12:10 AM

ఎక్కడో కొమ్మచాటున కూస్తున్న 

కోకిల పాటను

తనివితీరా విందామని చెట్టువైపు చూశాను

ఒంటరి పాటను ఆలపిస్తున్న వాసంతము

గతకాలాన్ని వినిపిస్తూ జ్ఞాపకాలని 

పరిచయం చేస్తుంది

సాలెగూళ్లలా అల్లుకున్న 

బంధాలన్నీ పటాపంచలై

ఒంటరి బతుకుపాటని 

పాడుతున్న జీవితానికి

వనప్రియ గడిచిన కాలాన్ని 

పాఠముల్లే వల్లె వేస్తుంది!

మాయదారి మనుషుల 

మర్మాన్ని చెవిన చేరుస్తుంది !!


నదీజలమై ఎండిన ఎన్నో 

గొంతులను తడిపిన

చేతులు ఇప్పుడు ఒకరి సహాయం 

కోసం చూస్తున్నాయి

కాలువలా ప్రవాహమై పారిన జీవనం

ఎండిపోయిన వాగులా మారింది

ఒంటరిపాటనై బతుకు పాటను 

ఆలపిస్తున్నాను

ఏ గొంతు తోడుగా నిలవడం లేదు

ఏ చేతులూ అలసిన గొంతును 

ఓదార్చడం లేదు!


నాతో నేను ఏకాంతంగా బతుకు పాటను

ఆలపిస్తుంటే గాంధర్వము 

నాకు తోడై నిలిచి.. దుఃఖంతో

నిండిన గుండె దాహాన్ని తీరుస్తుంది.

చీకటినిండిన ఎదలో 

ధైర్యమనే మిణుగురులావెలగమంటుంది.

మాయ మనుషుల 

మర్మం తెలుసుకొని జాగ్రత్తగా

మెదులమంటుంది!!