calender_icon.png 23 September, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నళిని పోస్టుపై స్పందించిన సర్కార్

23-09-2025 01:49:36 AM

-సీఎం ఆదేశాలతో మాజీ డీఎస్పీని కలిసిన యాదాద్రి జిల్లా కలెక్టర్ 

-ప్రభుత్వం సహాయం చేస్తుందని భరోసా

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మాజీ డీఎస్పీ నళినిని సోమవారం ఆమె ఇంట్లో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కలిసి, సమస్యలను తెలుసుకు న్నారు. రుమటాయిడ్ అర్థరైటిస్, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు నళిని కలెక్టర్‌కు వివరించారు. తాను ఎన్నో రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నానని తెలిపారు.

అల్లోపతి మందులు పడకపోవడంతో ఆయుర్వేద మందులను వాడటం వల్ల ఉపశమనం ఉందని కలెక్టర్ కు తెలిపారు. అయితే ప్రభుత్వం వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని కలెక్టర్ హనుమంతరావు నళినికి భరోసా ఇచ్చారు. సర్వీస్‌కు సంబంధించి సమస్యలున్నా నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామన్న సీఎం సందేశాన్ని నళినికి కలెక్టర్ హనుమంతరావు తెలియజేశారు. కాగా ఆదివారం నళిని తన పేరు మీద ఫేస్‌బుక్ ద్వారా మరణ వాంగ్మూలం అంటూ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ పోస్టు వైరల్ కావడంతో ప్రభుత్వం స్పందించింది. 

బండారు దత్తాత్రేయ ఆరా

ముషీరాబాద్(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించి, ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ తెలంగాణ ఉద్యమకారిణి, తమ కు అత్యంత ఆత్మీయురాలు, మాజీ డి.ఎస్.పీ.  నళిని ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె ఫేస్బుక్ ఖాతా ద్వారా, అలాగే ఈ రోజు పత్రికలలో చదివి తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని అన్నారు. సోమవారం ఆమెతో ఫోన్లో మాట్లాడి స్వయంగా ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశానని తెలిపారు.

ఆమెను ధైర్యపరుస్తూ గతంలో ఏ విశ్వాసంతో, ఏ నిబద్ధ తతో జీవితం గడిపారో, అదే విశ్వాసంతో ముందుకు సాగాలని సూచించినట్లు తెలిపారు. ఆరోగ్యం విషయంలో అధికంగా చింతించాల్సిన అవసరం లేదని ప్రోత్సహించానని  బండారు దత్తాత్రేయ తెలిపారు.

ఆ యుర్వేద వైద్య విధానాల ద్వారా పూర్తి ఆరోగ్యవంతురాలిగా మారుతారని తనకు గట్టి నమ్మకం ఉందని, ఇందుకోసం నాకు సుపరిచితులైన  రామ్ దేవ్ బాబా ను సంప్రదిం చానని,  నళినికి హరిద్వార్లో ఆయుర్వేద చికి త్స అందించేందుకు వారు అంగీకరించారని  బండారు దత్తాత్రేయ తెలియజేసారు. తన ఆరోగ్య విషయాన్నీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లాలని అభ్యర్థన మేరకు తాను లేఖ ద్వారా ఈ విషయా న్నీ ప్రధాన మంత్రి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వైద్య సహాయాన్ని అందేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగిందని బండారు దత్తాత్రేయ  తెలిపారు.