23-09-2025 01:49:28 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం కేవలం రెండు గంటల్లోనే దాదాపు 10 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. రహదారులు నదులను తలపించగా, లోతట్టు ప్రాంతాలు చెరువులుగా మారాయి. బంజారాహిల్స్‌లో అత్యధి కంగా 10.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్‌ఆర్ నగర్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రధాన ప్రాంతా ల్లో భారీ వర్షం కురిసి, రోడ్లపై నడుము లోతు నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయా యి. షేక్‌పేట ఫ్లైఓవర్ దిగే మార్గంలో భారీ గా నీరు చేరడంతో అధికారులు ఫ్లైఓవర్‌ను మూసివేశారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ఇరువైపులా మోకాళ్ల లోతు నీరు చేరడంతో, స్టేషన్‌లో దిగిన ప్రయాణికులు కిందికి రాలే క మెట్లపైనే నిలబడిపో యారు.
రాజ్‌భవన్ రహదారి, మైత్రివనం మార్గాల్లో వాహనా లు నిలిచిపోయాయి. భారీ వర్షానికి వెంకటేశ్వర కాలనీ డివిజన్‌లోని దేవరకొండ బస్తీని నాలా ముంచెత్తింది. సమాచారం అందుకున్న నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హైడ్రా బృందాలతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నెం.7 నుంచి కాలినడకన బస్తీలోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్‌తో కలిసి కేబీఆర్ పార్క్ వద్ద ఉన్న మేజర్ వాట ర్ లాగింగ్ పాయింట్లను పరిశీలించారు.
కొట్టుకుపోయిన వాహనాలు
భారీ వానకు బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని జారానగర్ కుంట పొంగిపొర్లడంతో హకీంపేటలో వరద బీభత్సం సృష్టించింది. వరద ఉధృతికి ఓ ఆటో, పలు ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. ఓ వ్యాన్ కొట్టుకుపోతుండగా, డ్రైవర్ అతి కష్టం మీద దాన్ని బయటకు తీసుకువచ్చాడు.
ఇదే ప్రాంతంలో వరద ధాటికి ఓ గోడ కుప్పకూలగా, ఓ విద్యుత్ స్తంభం నేలకొరిగింది. కృష్ణానగర్‌లోనూ పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్నగర్‌లోని అనేక కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు.
వారం రోజుల పాటు వానలే..
రాష్ట్రంలో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం కొమురంభీం ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి , మేడ్చల్ మల్కాజ్‌గిరి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
రాజన్న సిరిసిల్ల/నర్సంపేట/దుగ్గొండి, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. వరంగల్ జిల్లా దు గ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన మొద్దు రాకేష్ (25) సోమవారం పొలంలో పని చేసుస్తుండగా.. భారీ ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. మోటార్‌ను బందు చేసేందుకు వెళ్తు న్న రాకేష్‌పై పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినిపల్లి మండలం వరదవెల్లికి చెందిన గొర్రె కాపరి మొగిలి మల్లయ్యపై పిడుగు పడటంతో మృతి చెందాడు.
నమోదైన వర్షపాతం (సెం.మీ.లలో)
బంజారాహిల్స్ 10.15
శ్రీనగర్ కాలనీ 9.55
ఖైరతాబాద్ 8.33
మైత్రివనం 6.55
హయత్ నగర్ 6.03
ముషీరాబాద్ 5.15
రహెమత్ నగర్ 4.83
హిమాయత్ నగర్ 4.63