calender_icon.png 2 July, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

01-07-2025 06:50:07 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్(CITU District Treasurer Bhaskar) అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో కార్మికులతో కలిసి సమ్మె కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదనీ విమర్శించారు. ఈ చర్యలు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)సి, ఆర్టికల్ 21, 24, 39(డి)కి విరుద్ధమైనవని అన్నారు.

కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుందనీ, కార్మికుల సమిష్టి బేరసారాల శక్తి నిర్వీర్యం చేయబడుతూ, సమ్మె హక్కుకు సైతం కోల్పోతారని మండిపడ్డారు. కాంట్రాక్ట్ కార్మికులకు సమానమైన పనికి సమాన వేతనం అమలు చేయాలనీ, నెలకు కనీస పెన్షన్ రూ.9000/- ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కొరకు జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ లక్ష్మీ, వివిధ రంగాల కార్మికులు బాలమణి, షాహిన్ సుల్తానా, లావణ్య, లక్ష్మీ, బాలరాజు, ఎల్లం, రవి, స్వామి, నర్సింలు, కిష్టయ్య, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.