15 April, 2026 | 5:41 PM

వైద్య వృత్తి మానవతా సేవకు ప్రతీక

04-11-2025 12:28 AM

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 3, (విజయక్రాంతి)వైద్య వృత్తి మానవతా సేవకు ప్రతీక, విద్యార్థులు నిబద్ధతతో సమాజానికి సేవ చేయాలి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలోనూతన వైద్య వి ద్యార్థులు వైద్య వృత్తిలో అడుగుపెట్టిన సందర్భంగా వైట్ కోట్ వేడుకలను ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ..వైద్య వృత్తి మానవతా సేవకు ప్రతీక అని, ఇది కేవలం ఉద్యోగం కాదు ఇది సమాజానికి అంకితమైన పవిత్ర బాధ్యత అన్నారు. వైద్య విద్యార్థులు రోగుల పట్ల కరుణ, సహానుభూతి, అంకితభావం కలిగి పనిచేయాలి అని తెలిపారు. మీ చేతుల్లో సమాజ ఆరోగ్య భవిష్యత్తు ఉంటుందని, అ త్యున్నత వైద్య నైతిక ప్రమాణాలను పాటి స్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి వైద్యుడి ధర్మం అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణలో యు వ వైద్యుల పాత్ర ఎంతో కీలకం అన్నారు.

మీరు రాబోయే రోజుల్లో దేశ వైద్య రంగానికి మూల స్తంభాలు అని, ఈ దశలోనే మీరు క్రమశిక్షణ, సమయపాలన, మానవతా దృక్పథం, ప్రజల పట్ల బాధ్యత వంటి విలువలను ఆచరించాలి అని నూతన విద్యార్థులకు సూచించారు. వైద్యునిగా సమాజా నికి మీరు చేసే సేవే మీ గొప్పతనం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, రోగులు అందరికీ గౌరవం ఇవ్వండి. ఈ వైట్ కోట్ కేవలం వ స్త్రం కాదు ఇది నైతికత, సేవ, నిబద్ధతలకు ప్ర తీక అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు వైద్య నైతిక ప్రమాణాల పట్ల నిబద్ధత వ్యక్తం చేస్తూ ప్రతిజ్ఞ చేశారు.అనంతరం 150 మంది నూతన వైద్య విద్యార్థులకు కలెక్టర్ చేతులు మీదుగా తెల్లకోటును అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీహరి రావు, కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ రాధామోహన్, వైద్య కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు వారి తల్లిదం డ్రులు తదితరులు పాల్గొన్నారు.