పెద్దగోపులారం నూతన పాలకవర్గాన్ని సన్మానించిన మంత్రి
మునిపల్లి, డిసెంబర్‌౧౬: రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మండలంలోని పెద్దగోపులారం గ్రామ పంచాయతీల్లో నూ తనంగా ఎన్నికైన సర్పంచ్ బుడ్డ మల్లేశం, ఉప సర్పంచ్ బుర్కల లలిత, వార్డు సభ్యులు మంగళవారం సంగారెడ్డిలోని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని సన్మానించి స్వీట్లు తినిపించి అభి నందించి శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎంపీపీ బుర్కల పాం డు, మార్కెట్ కమిటీ, ఆత్మ కమిటీ డైరెక్టర్లు అమరేశ్వర్, బేగరి రామయ్య, యూత్ కాం గ్రెస్ మండల అధ్యక్షుడు బుర్కల రాజు, వా ర్డు సభ్యులు జయమ్మ, గోపాల్ శ్రీధర్, సంతోష, నాయకులు పిల్లోడి మల్లన్న, జా నీ మియా, షరీఫ్, వెంకటేశం, మల్లన్న, నరేందర్ చారి, మోహన్, కృష్ణ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.






