17-12-2025 12:00:14 AM
మునిపల్లి, డిసెంబర్ 16 :మండల కేంద్రమైన మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వైద్యాధికారులు, సిబ్బంది హాజరు పట్టిక, వివిధ రికార్డులు, ఆసుపత్రి పరిసరాలనుపరిశీలించారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్లు, సిబ్బం ది సమయ పాలన పాటించాలని ఆయన సూచించారు. ఆయన వెంట మునిపల్లి డాక్టర్ సంధ్యారాణి, సీహెచ్‌ఓ సురేందర్, పీహెచ్ ఎన్ చంద్రభాను, సూపర్ వైజర్ విజయలక్ష్మి, స్టాప్ నర్సు ప్రియలత తదితరులు ఉన్నారు.