11-09-2025 05:12:42 PM
మంథని (విజయక్రాంతి): మండలంలోని రచ్చపల్లి గ్రామానికి చెందిన శనిగారపు కుమార్ స్వామి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మరణించాడు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో అట్టి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు. ఆ కుటుంబానికి మన ప్రజా ప్రభుత్వం ద్వారా రాష్ట్ర మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు గురువారం రూ. 5 లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు మంత్రి శ్రీధర్ బాబు అప్పగించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సలహా మండలి సభ్యులు కాచే శేషిభూషణ్, మాజీ వైస్ ఎంపీపీ జనగామ నర్సింగరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాంపెళ్ళి నాగరాజు, సల్పల మల్లేష్, దాసరి ప్రసాద్, కొల్లూరి అశోక్, బొడ్డుపల్లి ఓదెలు,శంకర్, వంకుదోత్ రాజు, శెనిగరపు తిరుపతి, ప్రవీణ్, సుమన్ పాల్గొన్నారు.