11-09-2025 05:10:49 PM
నకిరేకల్ (విజయక్రాంతి): అక్టోబర్ 2న విజయదశమి పండుగ నిర్వహించాలని శ్రీ గాయత్రీ వైదిక బ్రాహ్మణ పరిషత్ ఏకగ్రీవంగా తీర్మానించింది. గురువారం స్థానిక ఐశ్వర్య సాయి మందిరంలో పగిడిమర్రి వెంకటేశ్వర శర్మ అధ్యక్షతన బ్రాహ్మణ పరిషత్ నకిరేకల్ నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 21న ఎంగిలి పువ్వు బతుకమ్మ, 22 నుండి శరన్న వరాత్రోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. సెప్టెంబర్ 29న సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆ సంఘ సభ్యులు పగిడిమర్రి మధుసూదన్ శర్మ, దుర్గి మురళీధర్ శర్మ, వావిలాల రామలింగేశ్వర శర్మ కాటేపల్లి,శ్రీనివాస్ శర్మ, నారాయణ చంద్రమౌళి శర్మ, ఈదుల వాడ ఆనంద్ శర్మ నిడిగొండ గౌతమ్ శర్మ, పగిడిమర్రి నవీన్ శర్మ, నందిబట్ల భరద్వాజ్ శర్మ, నందిబట్ల సోమశేఖర్ శర్మ, పగిడిమర్రి ఫణి శర్మ పాల్గొన్నారు.