17-12-2025 01:31:26 AM
ఎల్బీనగర్, డిసెంబర్ 16 : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని కుటుంబ సభ్యులను మంగళవారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సతీమణి కమలా సుధీర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు పరామర్శించారు. హయత్ నగర్ డివిజన్ పరిధిలోని వినాయక నగర్ కాలనీనివాసి యంసాని ఐశ్వర్య మహబూబ్ నగర్ లోని ఎస్వీఎస్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నది. సోమవారం కాలేజీకి వెళ్లడానికి తండ్రి పాండుతో కలిసి జాతీయ రహదారి దాటుతుండగా కారు ఢీకొట్టడంతో ఐశ్వర్య అక్కడికక్కడే మృతిచెందగా, తండ్రి పాండు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సతీమణి కమలా సుధీర్ రెడ్డి బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఐశ్వర్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని, కఠినమైన శిక్ష పడేలా చేసి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఆర్థికసాయం అందజేసిన మాజీ కార్పొరేటర్..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్ధిని కుటుంబ సభ్యులను మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మృతురాలి తండ్రి పాండును పరామర్శించారు.
మన్సూరాబాద్ డివిజన్ లో ఇటీవల వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని పరామర్శించారు. వీరన్నగుట్టలోని బాలుడి ఇంటికి వెళ్లి, వైద్య ఖర్చుల నిమిత్తం 5 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని కొప్పుల విఠల్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు అత్తపురం రామచంద్ర రావు, పారంద నర్సింగ్ రావు, కేకేఎల్ గౌడ్, డాక్టర్ నర్సింహ, వెంకటరావు, శ్రీనివాస్, హరి గౌడ్ తదితరులు ఉన్నారు.