29-10-2025 04:29:07 PM
చండూరు/నాంపల్లి (విజయక్రాంతి): మునుగోడు నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి నుండి మల్లెపల్లి పోయే రహదారి మధ్యలో ముష్టిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అకాల వర్షాలకు రోడ్లలో మొత్తం నీరు నిండిపోవడంతో చెరువుల తలపిస్తుంది. దీనివలన వివిధ గ్రామాల ప్రజలు వాహనదారులు, చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. దీనిపై అధికారులు స్పందించి రోడ్డు భవనాల శాఖ ఎంబడే మరమ్మత్తులు చేపట్టాలని సంబంధింత అధికారులు స్పందించి, రోడ్లపై నీరు నిలువ లేకుండా చేయాలని నాంపల్లి మండల ప్రజలు కోరుకుంటున్నారు.