calender_icon.png 1 November, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా బిడ్డకు న్యాయం చేయండి...!

01-11-2025 03:57:17 PM

నా బిడ్డ తండ్రి ఎవరుంటే ఏం చెప్పాలి..? 

అబార్షన్ కోసం ఐదు లక్షల ఎర..? 

 ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు చంటి బిడ్డతో ధర్నా

నకిరేకల్,(విజయక్రాంతి): వివాహేతర సంబంధం ఓ బిడ్డకు ప్రాణం పోసింది. ప్రెగ్నెన్సీ తొలగించుకోమంటే తొలగించుకోవా... ఐదు లక్షలు ఇస్తా అన్నగా.. అయినా పట్టించుకోవా... నేను చెప్పింది వినట్లేదుగా నీ దారి నీదే.. నా దారి నాదే.. అంటూ గత కొంతకాలంగా ప్రియుడు ప్రియురాలు  మధ్య సంభాషణలు, చూపులు, పలకరింపులు కరువయ్యాయి. దీంతో ఆగ్రహించిన ప్రియురాలు నా బిడ్డకు తండ్రి అంటే ఎవరనీ చెప్పాలి. నమ్మించి మోసం చేస్తావా అంటూ నా బిడ్డకు న్యాయం చేయాలి తండ్రిగా కొనసాగాలి అంటూ ప్రియుడు ఇంటి ముందు చంటి బిడ్డతో ధర్నా చేసిన సంఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గ్రామస్తులు, బాధితురాలు రేణుక తెలిపిన వివరాల ప్రకారం... శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన రేణుక, నకిరేకల్ మండలం నెలిబండ గ్రామానికి చెందిన బోగిళ్ళ అశోక్ తో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్నేళ్ళకు అశోక్ అనారోగ్యంతో మృతి చెందాడు. అశోక్ ఉన్నప్పటి నుండే  అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఓరుగంటి విష్ణుతో తనకు వివాహేతర సంబంధం ఉందని తెలిపింది. అశోక్ మృతి చెందిన తర్వాత నీకు అండగా నేనుంటానని  ఆయన నమ్మబలికి బాధితురాలితో పలుమార్లు శరీరకంగా కలిసి రెండు, మూడు సార్లు అబార్షన్లు సైతం చేయించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అబార్షన్లు చేయించడం ఏంటి అని గట్టిగా నిలదీయడంతో నాకు వివాహం జరిగిందన్నాడు.

తనకు ఇద్దరూ పిల్లలు ఉన్నారని, నీ కులం వేరు, నా కులం వేరు నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకోగలను..? అనడంతో మా ఇద్దరి మధ్య సంఘర్షణ మొదలై దూరంగా ఉంటున్నామని బాధితురాలు తెలిపింది. ఇదే విషయాన్ని పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడితే ప్రెగ్నెన్సీ తీయించుకుంటే రూ.5 లక్షలు ఇస్తామని చెప్పడంతో నేను ససేమిరా అన్నాను అని ఆమె వెల్లడించింది. దీంతో అప్పటి నుండి నాతో విష్ణు ఫోన్ మాట్లాడడం, చూడటం, హాస్పిటల్ చూపించడం కానీ మానివేసిన్న, అన్ని భరించి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం నా బిడ్డకు, నాకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగింది బాధితురాలు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శనివారం స్థానిక గ్రామపంచాయతీ వద్ద పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహిస్తున్నట్లు సమాచారం.