17-12-2025 12:00:00 AM
కామారెడ్డి, డిసెంబర్ 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో, దోమకొండ పట్టణ బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గ్రామపంచయతీ ఎన్నికలలో ఎన్నికైన నూతన ఉప సర్పంచ్ , వార్డ్ సభ్యులకు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఉపసర్పంచ్ గా ఎన్నికైన శ్రీ బొమ్మెర శ్రీనివాస్, మరియు వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్, బీసు సతీష్ కుమార్, ఐరెని లత రాజేందర్, బొబ్బసాని రమ్య సుధాకర్ ను సన్మానించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ కుంచాల శేఖర్, పట్టణ అధ్యక్షులు బోరెడ్డి కిషన్ రెడ్డి ఆసంశెట్టి పోచయ్య, నాగరాజు రెడ్డి, మన్నె సాయి రెడ్డి, పార్టీ నాయకులు కానుగంటి నాగరాజు , చిట్యాల రాజిరెడ్డి, కూర చంద్రం, మల్లెబోయిన రాజు, బొమ్మెర గంగాధర్, చెన్ను గారి నర్సింలు, అనుమాల అశోక్ , అవధూత సహదేవ్, కట్ట నారాయణ, ముద్దసాని చంద్రం, నిమ్మ రాజనర్సు, దోమకొండ పోచయ్య పాల్గొన్నారు.