calender_icon.png 11 July, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెరగాలి

11-07-2025 12:59:10 AM

రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ భద్రసేన్ 

ముషీరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అధ్యాపకులు కృషి చేయాలని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ డిప్యూటీ సెక్రెటరీ భద్ర సేన్ చెప్పారు. కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల గురువారం ఆయన సందర్శించి విద్యార్థులు. అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించారు.  అవినీతి లేని పవిత్రమైన ఉపా ధ్యాయ వృత్తిలో ఉన్న అధ్యాపకులు సేవా భావంతో విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలని తెలిపారు.

ప్రైవేటు దీటుగా ప్రభు త్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులను నైపుణ్యవంతులు చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు అనుగుణంగా  అధ్యాపకులు విద్యా బోధన నూతన పద్ధతులను పాటించాలని  ఆయన చెప్పా రు. అధ్యాపకులు తరగతి గదికి వెళ్లే ముందు మనం బోధించే పాఠ్యాంశాల్లో విషయ పరిజ్ఞానంతో రూపొందించిన చిత్రం ద్వారా విద్యాబోధన చేయాలన్నారు.

రాష్ట్ర ఇంటర్మీడియట్ డిప్యూటీ సెక్రటరీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కళాశాలలో చదివే పేద విద్యార్థులు కాబట్టి తమ కుటుంబ పరిస్థితులను  దృష్టిలో ఉంచుకొని క్రమం తప్పకుండా కళాశాలకు వచ్చి శ్రద్ధగా చదువుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థులు ఎన్నో ఉన్నత పదవులను చేపట్టారని ఆయన గుర్తు చేశా రు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. చిరంజీవి మాట్లాడుతూ కళాశాల ప్రస్తుతం 500 మంది పైగా నూతన విద్యార్థులు చేరారని అయితే  వారు గైర్హాజర్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఆయన చెప్పారు,  చదువు పట్ల ఆసక్తి పెంచేందుకు విద్యార్థులను ప్రోత్సహించాల్సిన గురుతర బాధ్యత అధ్యాపకుల పై ఉందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో అధ్యాపకులు  పాల్గొన్నారు.