22 April, 2026 | 1:37 AM

గిరిజా షెట్కార్ మృతి తీరని లోటు

22-04-2026 12:00 AM

బిచ్కుంద ఏప్రిల్ 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కీర్తిశేషులు మల్లికార్జునప్ప షెట్కార్ సతీమణి గిరిజా సోమవారం నాడు మృతి చెందారు. విషయం తెలుసుకున్న జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని గిరిజా షెట్కార్ మృతి తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం పాడే మోశారు. మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే మృతి పట్ల సంతాపం తెలుపుతూ కుటుంబీకులకు సానుభూతిని వ్యక్తం చేశారు. అనేక గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, వ్యాపారస్థులు, గ్రామస్తులు  పాల్గొన్నారు.