calender_icon.png 23 July, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి యువతకు గత గిరిజన ఆచార వ్యవహారాలను

23-07-2025 12:00:00 AM

తెలిపే మ్యూజియం ఏర్పాటు చేయటం అభినందనీయం 

భద్రాచలం, జులై 22, (విజయ క్రాంతి): నేటి తరం గిరిజన బాల బాలికలకు తాతల కాలంలో ఆచరించిన గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు తెలుసుకునే విధంగా మ్యూజియం రూపకల్పన చేసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారావు అన్నారు.

మంగళవారం ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజి యంను దుమ్ముగూడెం మండలంలోని కొత్తపల్లి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న బాలుర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు 600 మంది, 24 మంది ఉపా ధ్యాయులు సందర్శించి మ్యూజియంలో పొందుపరిచిన గిరిజనుల అన్ని కళాఖండాలను క్లుప్తం గా తిలకించారు.

ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు నేటితరం బాల బాలికలకు తెలిసే విధంగా కళాఖండాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటి యొక్క చరిత్రను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా తెలుగులో ముద్రించి ప్రదర్శించడం వలన విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగతమైందని, మ్యూజియంలో మాత్రం గిరిజనులకు సంబంధించిన స్పష్టమైన సమాచారం విద్యార్థులకు తెలిసే విధంగా మ్యూజియం నిర్వహకులు ప్రతి అంశం తెలియజేయడం చాలా బాగుందని అన్నారు.

ఆదివాసి గిరిజనుల సంస్కృతి భాష గిరిజనుల వేషధారణ కనుమరుగు కాకుండా కోయ భాషను తాను నేర్చుకొని భాష యొక్క అంతర్యాన్ని గిరిజనులు మరిచిపోకుండా అంద రూ ఆచరించే విధంగా ఆయన చేస్తున్న కృషికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవిత్నం, నాగేశ్వరరావు, చెన్నారావు, శివ ప్రసాద్, రమేష్, నరేందర్ మ్యూజియం నిర్వహకులు మాధవి, చలపతిరావు, విద్యార్థులు పాల్గొన్నారు.