23-07-2025 01:27:34 PM
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు
హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగ కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, విష జ్వరాలు నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు తెలిపారు. ఐదు మండలల ఎంపీడీవోలు, ఇద్దరు కమిషనర్లతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి అధికారులను అప్రమత్తం చేశారు. రైతులు పొలాల వద్దకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.