calender_icon.png 5 September, 2025 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్‌లో ఉన్న రేషన్ డీలర్ల కమిషన్‌ను తక్షణమే విడుదల చేయాలి

04-09-2025 01:21:04 AM

రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం

ఖైరతాబాద్; సెప్టెంబర్ 3 (విజయ క్రాంతి) : గత ఐదు నెలలుగా పెండింగ్  ఉన్న రేషన్ డీలర్ల కమిషన్ ను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్  చేసింది. ఈ మేరకు ఈనెల ఐదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలను మూసివేయునన్నట్లు తెలిపింది.ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంక్షేమ సంఘం రాష్ట్ర బడ్యక్షులు బత్తుల రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల హనుమండ్లు  మాట్లాడారు..

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రకారం రేషన్ డీలర్లకు 5000 గౌరవ వేతనంతో పాటు కమిషన్ ను ఫ్రెంచ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం ,కేంద్రం ప్రభుత్వం  కమీషన్ వేర్వేరు కాకుండా ఒకే కమీషన్ గా చెల్లించాలని కోరారు.  రేషన్ షాపులను మిని సూపర్ మార్కెట్ లుగా గుర్తించి మరిన్ని నిత్యవసర సరుకులు పేద ప్రజలకు అందుబాటులకు తేవాలని, రేషన్ షాపుల అద్దెలను ప్రభుత్వ భరించాలని  అన్నారు.

డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీ నారాయణ, కోశాధికారి  కిరణ్ కుమార్ రెడ్డి, న్యాయసలహాదారులు బచ్చు రాము, శ్యాం, రమేశ్ సంయుక్త కార్యదర్శి బత్తుల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.