04-09-2025 01:23:24 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి) : ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిశా రు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌చౌహన్‌తో మంత్రి తుమ్మల రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పామాయిల్ గెలలకు టన్ను కు రూ.25 వేలు కనీస మద్దతు ధరను కల్పించాలన్నారు.
ఆయిల్ పామ్ పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని విజప్తి చేశారు. తెలంగాణలోని నారాయణపేట, ములుగు, కొమురం భీం, ఆసిఫా బాద్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన పథకంలో చేర్చాలని కోరారు. వ్యవసాయ యంత్రాలపై, మైక్రో ఇరిగేషన్ పరికరాలపై ఉన్న 12 శాతం జీఎస్టీ మినహాయిం చాలని విజప్తి చేశారు.
ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్ వంటి రసాయన పోషకాలపై సబ్సిడీ పెంచి యూరియాతో సమానంగా ధరలో సమతుల్యత తీసుకు రావాలని కోరారు. అంతకు ముందు మంత్రి తుమ్మల ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి ముం దు చూపులేకపోవడంతోనే దేశ వ్యాప్తంగా యూరియా కొరత సమస్యగా ఉందన్నా రు. తెలంగాణలో ఖరీఫ్ సీజన్‌కి 11 లక్షల మెట్రిక్ టన్నులు అడిగితే 9.8 లక్షల మెట్రి క్ టన్నులు ఇస్తామని 5.20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చారన్నారు.