24-04-2025 12:00:00 AM
బెల్లంపల్లి అర్బన్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మాదారం పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యం లో పోలీసులు ‘మీకోసం’ కార్యక్రమంలో భాగంగా ఈనెల 27న మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సై సౌజన్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోగల నర్సాపూర్, ఎంవీకే 3 ఇంక్లైన్, నీలాయి పల్లి గిరిజన గ్రామాల ప్రజల కోసం ఈ మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజనులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నరసాపూర్ గ్రామ పంచాయతీ ప్రాంగణంలో ఉద యం 9 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు మెగా క్యాంపు జరుగుతుందని ఎస్‌ఐ తెలిపారు.