calender_icon.png 11 October, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపడాలి

11-10-2025 12:00:00 AM

కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

జనగామ, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : కలెక్టర్ కార్యాలయ సమావేశపు హల్లో.. శుక్రవారం అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పనితీరు పై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాల కార్యకలాపాల, ప్రగతిని శాఖ అధికారులు, సిబ్బందితో సమీక్షిస్తూ... ఆరోగ్యవంతమైన సమాజం కొరకు పునాది లొనే పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నందున 100 శాతం ఫలితాలు ఉండాలన్నారు.

హాజరు శాతం పెరగాలని, తగ్గకూడదన్నారు. తగ్గితే అందుకుగల కారణాలు విశ్లేషించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారులకు సామ్, మామ్‌లను నమోదు చేసి ఆరోగ్యాల కనుగుణంగా వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డాక్టర్ అశోక్, సి.డి.పి.ఓ.లు,సూపర్ వైసర్ లు, పోషణ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి 

జనగామ, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : బతుకమ్మ కుంట ను వినియోగం లోకి తీసుకవచ్చేందుకు.. అభివృద్ధి పనులు అతి త్వరగా పూర్తి కావాలని కలెక్టర్ రిజ్వాన్  బాషా షేక్ అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తో, కలిసి బతుకమ్మ కుంట, లో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కోటి 50 లక్షల రూపాయల తో ప్రారంభించిన. బతుకమ్మ కుంట అభివృద్ధి పనులు దాదాపు పూర్తి అయ్యాయని.. మిగతా పనులు, కూడా త్వరగా పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. పంచతత్వ పార్క్, బండ్ ప్లాంటేషన్ పనులను త్వరగా అయిపోతే.. బతుకమ్మ కుంట  ప్రజలకు ఆహ్లాద వాతావరణాన్ని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉద్యనవన శాఖ అధికారి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

సమాచార హక్కు చట్టం అమలు ప్రతి ఒక్కరి బాధ్యత ః అదనపు కలెక్టర్ 

మహబూబాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : ప్రభుత్వ విభాగాలకు చెందిన సమాచార దరఖాస్తులను త్వరితగతిన దరఖాస్తుదారులకు పారదర్శకంగా, వేగంగా సమాచారం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందని మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కే.అనిల్ కుమార్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమాచార వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో అవగాహన కార్యక్రమం నిర్వహించి హాజరైన అధికారులతో సమాచార హక్కు చట్టం ప్రతిజ్ఞను చేశారు.