calender_icon.png 10 September, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తి మృతి..

10-09-2025 06:43:34 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన మురిమడుగుల మల్లయ్య(58) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ గోపతి సురేష్(SI Gopathi Suresh) ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు డయాలసిస్ పేషెంట్. మంగళవారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లి ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చొని ఉండగా నోట్లో నుండి నూరుగులు రావడంతో లక్షెట్టిపేట ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి  చనిపోయాడని తెలిపారు. మృతుడు పాము కాటుతో చనిపోయాడా లేక అనారోగ్యంతో చనిపోయాడా అని విచారణ జరిపి తగు చర్య తీసుకోగలరని మృతుని కొడుకు అరుణ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.