10-09-2025 06:40:47 PM
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం..
చండూరు/గట్టుపల (విజయక్రాంతి): త్రిబుల్ ఆర్ రోడ్డు మాకు వద్దు మా భూములు మాకు కావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం(CPM Party District Secretary Group Member Banda Srisailam) అన్నారు. గట్టుప్పల మండల కేంద్రంలో త్రిబుల్ ఆర్ రోడ్డు వద్దు అని మా భూములు మాకు కావాలని కోరుతూ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మండల తహసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్రిబుల్ ఆర్ రోడ్ వల్ల సారవంతమైన భూములు రైతులు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ త్రిబుల్ ఆర్ రోడ్ వేస్తే, భూమికి భూమి ఇవ్వాలని, ఓపెన్ వాల్యూవేషన్ మీద నాలుగు రెట్లు పెంచి ఇవ్వాలని ఆయన అన్నారు. ఇతర జిల్లాల్లో మహబూబ్ నగర్, కల్వకుర్తి ప్రాంతాలలో రైతులకు ఎకరానికి 80 నుండి 90 లక్షల దాకా కొంతమంది రైతులకు ఇచ్చారని, మరికొందరికి కోటి రూపాయల వరకు కూడా ఇచ్చారని ఆ రకంగా త్రిబుల్ ఆర్ రోడ్ వల్ల రైతులకు భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులకు తెలవకుండా అలైన్మెంట్ రూపొందించిన అలైన్మెంట్ రద్దు చేయాలని, గట్టుపల,నామాపురం, తేరటుపల్లి, వెల్మకన్నె రైతుల ఆమోదం లేకుండా అలైన్మెంట్ రూపొందించడం సరైనది కాదు అని ఆయన అన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలని లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ సిపిఎం నాయకులు కర్నాటి సుధాకర్, కర్నాటి వెంకటేశం, అచ్చిన శ్రీనివాస్, పగిళ్ల శ్రీనివాస్,, వల్లూరి శ్రీశైలం, బిఆర్ఎస్ పార్టీ గట్టుపల మండల అధ్యక్షులు టి. శంకర్,ఇడెం కైలాసం,బిఆర్ ఎస్ నాయకులుబాలం శ్రీను, అయిత రాజు హనుమంతు,సిపిఎం నాయకులు బండ లింగయ్య, పగిళ్లనరసింహ, విశ్వనాథ చారి, పెద్దగాని నరసింహ, హనుమంతు, పగిళ్ల శంకర్, శాయిబాబా, శంకర్, హరి, నరేష్, చిన్న నరసింహ తదితరులు పాల్గొన్నారు.