calender_icon.png 28 November, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తరిగొప్పులలో గులాబీ జెండా ఎగరాలి

28-11-2025 12:08:25 AM

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 

 తరిగొప్పుల, నవంబర్ 27 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని బిఆర్‌ఎస్ పార్టీ మండల నాయకుడు బుస యాదగిరి తండ్రి బుస రామస్వామి ఇటీవలె అనారోగ్యంతో మరణించిగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతా పం తెలియజేశారు.అనంతరం బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగిలి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోమండల కేంద్రంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్య కార్యకర్తలు నాయకులతో సమావేశాన్ని ఏ ర్పాటు చేశారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పల్ల రాజశేఖర్ రెడ్డి పాల్గొ ని,మాట్లాడుతూ.. నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నుండి ఈ రెండు సంవత్సరాల నుం డి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతున్న, మన ప్రతిమ హాస్పిటల్ లో అందరికీ కూడా ఫ్రీగా వైద్య సేవ అందిస్తున్నాను ఎ వరు పెళ్లికి పిలిచినా ఎవరు చనిపోయిన పరామర్శిస్తున్న, ఇవాళ ఎమ్మార్వోలకి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా పనిచేయాలని అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా కే సులు పెట్టినా కూడా వదిలిపెట్టమని చెప్తు న్నా కాబట్టి మీరు కూడా నాకు మద్దతుగా ఉండాలి కదా, కాబట్టి తరిగొప్పుల లో ప్రతి గ్రామం కావచ్చు తండా కావచ్చు ఇవాళ గు లాబీ జెండా ఎగరాలని, ఇవాళ గులాబీ కం డువా కప్పుకున్న మనం మాత్రమే ప్రజలకు సేవ చేస్తున్నాం ఇది ప్రజలకు వివరించాలి.

గత 60 ఏళ్ల నుండి కాంగ్రెస్ వాళ్లు పరిపాలించి మన ప్రాంతానికి నీళ్లు తెచ్చారా మన ప్రభుత్వంలోనే వచ్చాయి కచ్చితంగా తరిగొప్పుల మండల కేంద్రం లో గులాబీ జెండా ఎగరవేయాలి.అభ్యర్థుల మధ్య పోటీ ఉంటే ఒకరికి అవకాశం ఇచ్చి మిగతా వారికి ఎంపిటిసిగా ,జెడ్పిటిసిగా అవకాశాలు కల్పిస్తామ ని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.