calender_icon.png 28 November, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

28-11-2025 12:09:15 AM

  1. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పిలుపు
  2. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులతో సమీక్ష

ఆదిలాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నికలో భాగంగా ముందు గా నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలలో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డి ఆదేశాలతో ఆయన క్యాం పు కార్యాలయంలో  ఆదిలాబాద్ రూరల్, మావల,సాత్నాల మండలాల పరిధిలోని గ్రామ పంచాయితీల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మూడు మండలాలలోని ఆయా గ్రామపంచాయితీలలో సర్పంచ్, వార్డ్ మెంబర్ల కు పోటీపడే అభ్యర్ధులకు నామినేషన్ విషయంలో తగు దిశానిర్దేశం చేసారు. ఆశావహులు గ్రామాల వారీగా తమ పేర్లు కార్యాలయంలో నమోదు చేయించుకున్నారు. రానున్న ఎన్నికలకు ఇవి పునాది వంటివని ఇక్కడ బలంగా తయారై ఎన్నికల్లో విజయం సాధిస్తే అదే ఊపుతో మిగతా ఎన్నికలలో సత్తా చాటేందకు దోహదపడతాయని డీసీసీబీ చైర్మన్ అన్నారు.

పంచాయతీలలో పార్టీ మద్దతుతో ఎవరు పోటీ చేసినా గ్రామంలోని మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గెలుపుకోసం సహకరించాలన్నారు. గెలుపే లక్ష్యంగా అంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు, కొండ గంగాధర్, లోక ప్రవీణ్ రెడ్డి, గుడిపల్లి నగేష్ , శ్రీలేఖ తదితరులు తో పాల్గొన్నారు.