07-01-2026 12:49:55 AM
చొప్పదండి మునిసిపాలిటీ అభివృద్ధికి రూ. 120 కోట్ల నిధులు మంజూరు చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వందే
కాంగ్రెస్ మోసపూరిత దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కా రు
పట్టణంలో నిర్మాణం చేస్తున్న సెంట్రల్ లైటింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి
చొప్పదండి పట్టణంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
చొప్పదండి, జనవరి 6: రాబోయే మునిసిపాలిటీ ఎన్నికలలో ఎగిరేది గులాబీ జెండానే అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధీమా వ్యక్తం చేశారు. మంగ ళవారం చొప్పదండి పట్టణంలోని ఎస్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి ద్వారా అనేక నిధులు వెచ్చించి మున్సిపాలిటీలను అభివృద్ధి చేసిన ఘనత కేసిఆర్, కేటీఆర్ కే దక్కుతుందని కొనియాడారు.
మేజర్ గ్రామపంచాయతీ ఉన్న చొప్పదండిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం లో మున్సిపాలిటీగా మారిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చొప్పదండి పట్టణంలో వంద పడకల ఆసుపత్రి, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం, పాత వెదురుగట్ట రోడ్డు నిర్మాణం, పట్టణంలో అమృత స్కీం పథకం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, పట్టణ ప్రగతి ద్వారా రూ 120 కోట్ల నిధులతో అభివృద్ధి చేశామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 420 దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కారని, ఒక్క ఉచిత బస్సు తప్ప ఏ హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చూసామని మళ్లీ గతంలో మాదిరిగానే ఇప్పుడు రైతులు యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి మళ్లీ వచ్చిందని ఆందోళన చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కరికైనా రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చారని ప్రశ్నించారు.
చొప్పదండి మునిసిపాలిటీలో ఇందిరమ్మ చీరలు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకు వచ్చి పంపిణీ చేస్తారా అని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జీవోలు ఇచ్చుడు కాకుండా అభివృద్ధి చేసి చూపించామని తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అండదండలతో చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిపామని అన్నారు. చొప్పదండి నియోజకవర్గం లో చిరకాల వాంఛ అయిన సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పనులు చేపట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి మున్సిపాలిటీలో మళ్లీ గలాబీ జేండా ఎగురవేస్తామని అన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లాగ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి,
బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు వెల్మశ్రీనివాస్ డ్డి,పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, మాజీ కౌన్సిలర్లు కొత్తూరు మహేష్, మున్సిపల్ మాజీ కోఆప్షన్ అజ్జు, మాడూల్ శ్రీనివాస్, నాయకులు మాచర్ల వినయ్, నలుమాచు రామక్రిష్ణ, దండె కృష్ణ, బత్తిని సంపత్, మహేష్ ని మలే ్లశం, శెట్టిపల్లి పద్మ, గాండ్ల లక్ష్మణ్,జహీర్, పెద్దెల్లి అనిల్, మావూరం మహేష్, నరేష్ రావన్, నితిష్, రాజు, మోహన్ పాల్గొన్నారు.