calender_icon.png 4 October, 2025 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిభద్రతల కోసం పోలీస్‌శాఖ నిరంతరం కృషి

04-10-2025 12:00:00 AM

ఆయుధ పూజలో పాల్గొన్న ఎస్పీ రాజేష్ చంద్ర 

కామారెడ్డి, అక్టోబర్ 3 (విజయక్రాంతి): శాంతి భద్రతల కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయుధ పూజా కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో శాంతిభద్రతల కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందన్నారు., జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో విజయదశమి ఉత్సవాల జరుపుకోవాలని సూచించారు.

విజయదశమి సందర్భంగా ప్రజలందరూ చేస్తున్న ప్రతి పనిలో విజయవంతం కలగాలని ఆకాంక్షిస్తూ హాయ్ ద పూజలో పాల్గొన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని సాయిదబండాగారంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గాల్లోకి కాల్పులు జరిపి విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రజలకు మీడియాకు అదేవిధంగా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న వారికి వారి కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు ఎస్పీ తెలిపారు.  జిల్లా అదరప్ప ఎస్పీ నర్సింహారెడ్డి, ఏ ఎస్ పి చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డి.ఎస్.పి శ్రీనివాసరావు, జిల్లాలోని ఇన్స్పెక్టర్ లు, ఎస్త్స్రలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.