calender_icon.png 4 October, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతియుతంగా దుర్గామాత శోభాయాత్ర

04-10-2025 12:00:00 AM

బైంసా అక్టోబర్ 3 (విజయ క్రాంతి) : బైంసాలో శుక్రవారం దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఐబి కూడలి వద్ద ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పూజలు చేసి శోభయాత్రను ప్రారంభించారు. శోభాయాత్రలో యువకులు భక్తులు ఎంత ఉత్సాహంతో నృ త్యాలు చేస్తూ ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చే కోకుండా ఏఎస్పి అ వినాష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ గోపీనాథ్ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల పట్టారని సందర్శించి శాంతిభద్రతలను పర్యవేక్షించారు.