calender_icon.png 4 October, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జుక్కల్‌లో పోటాపోటీగా అలయ్.. బలయ్..

04-10-2025 12:00:00 AM

జుక్కల్, అక్టోబర్ 3 (విజయకాంతి) : జుక్కల్ మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే దసరా పండుగను పురస్కరించుకొని కార్యక్రమాలను వేరువేరుగా నిర్వహించుకున్నారు. క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే తోట ఈ కార్యక్రమాన్ని నిర్వహించగాజుక్కల్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం భవనంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కార్యక్రమాన్ని నిర్వహించారు.

క్యాంపు ఆఫీసు కార్యాలయానికి కాంగ్రెస్ శ్రేణులు చేరుకొని ఎమ్మెల్యేకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే వద్దకు వెళ్లిన టిఆర్‌ఎస్ శ్రేణులు బంగారం ఇచ్చి ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే ఫోటో పోటీగా ఒకేరోజు అలై బలై కార్యక్రమం నిర్వహించడం పట్ల సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ విధంగా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎమ్మెల్యేలు నిర్వహించలేదని ప్రజలు చర్చించుకున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఓకే మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం పట్ల ప్రజలు పలు విధాలుగా దర్శించుకున్నారు. ఎన్నికల సీజన్ కావడంతో ఎవరి వివరాలు వారు చెప్పుకునేందుకు ఈ విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని పలువురు విమర్శకులు పేర్కొంటున్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో..

బిచ్కుంద, అక్టోబర్ 03 ( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా  తెలంగాణలో పెద్ద పండుగ దసరా సందర్భంగా.. రాజకీయాలకు అతీతంగా జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అలయ్ బలయ్ కార్యక్రమంతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి జుక్కల్ నియోజక వర్గ కార్యకర్తలు,ప్రజలకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ సంస్కృతి నలు దిశలా వ్యాపించడానికి, మనమంతా ఒక్కటే అనే సందేశం ఇయ్యడానికి ’అలయ్ బలయ్’ గొప్ప వేదిక అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. మద్నూర్ మండల నాయకులు పాల్గొని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. బంగారం ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్ పటేల్ హనుమాన్ మందిర్ ఆలయ ఛైర్మన్ రామ్ పటేల్, హనుమాన్లు స్వామి విఠల్ గురూజీ టీ. గంగాధర్ నియోజకవర్గ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.