14-08-2025 01:33:08 AM
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాం తి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ బీజేపీ, ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ చేస్తున్న పోరాఆనికి మద్దతుగా నిలవాలని టీపీసీసీ వర్కిం గ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కోరారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాసిచ్చిన స్క్రిప్ట్‌నే కేంద్ర ఎన్నికల కమిషనర్ చదువుతున్నారని మండిపడ్డారు.
రాహుల్‌గాంధీ అడుగుతున్న ప్రశ్నలపై ఎం క్వురై చేయడం లేదని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండకూడదనేది బీజేపీ కుట్ర అని దుయ్యబట్టారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక స్క్రిప్ట్ రీడర్ అని విమర్శిం చారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ హయాంలోనే ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోవద్దన్నారు.
దొంగ ఓట్ల ద్వారానే బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిందని, మూడోసారి అధికా రంలో కి రావాలని మోదీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ కుటుంబం మీద బీజేపీ కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతోందన్నారు. ఏపీకి బీజేపీ తండ్రి అయితే జ గన్, చంద్రబాబు కొడుకులు అని విమర్శించారు.
ఏపీ రాజకీయాలు కల్లుదుకాణం ద గ్గర కూచునే అన్నదమ్ముల్లా ఉంటాయని, అందులో బీజేపీ కల్లు దుకాణం అ యితే చంద్రబాబు, జగన్‌లు అన్నదమ్ములని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ ద మ్మున్నోళ్లమేనని, చంద్రబాబు, జగన్‌లు బానిసలని జగ్గారెడ్డి సమాధా నమిచ్చారు.