calender_icon.png 7 October, 2025 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐరాస సర్వసభ్య సమావేశాలలో పాల్గొననున్న వంశీ

07-10-2025 03:27:26 PM

మందమర్రి,(విజయక్రాంతి): ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజ‌రుకానున్నారు. ఈ మేరకు మంగళవారం సమావేశాలలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొనే  సమావేశంలో భారతదేశం తరఫున పాల్గొంటూ, దేశ అభివృద్ధి, సమానత్వం, సామాజిక న్యాయం వంటి ప్రధాన అంశాలపై చర్చించనున్నారు.

ఇప్పటివరకు భారతదేశం తరఫున కొద్ది మంది ఎంపీలకు మాత్రమే ఈ సమావేశాలకు హాజరు కాగా, అత్యున్నత వేదికపై తెలంగాణ రాష్ట్రం నుండి అందులో  పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కు అవకాశం దక్కడంతో నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులతో  ఆయన పరస్పర చర్చలు జరప నున్నారు. ప్రపంచ స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక సమానత్వం, విద్యా, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలపై భారత దృక్కోణాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించనున్నారు.