ప్రజానాడిని పట్టే పార్టీ ఏది?
09-05-2024 12:05 AM
పార్లమెంట్ ఎన్నికలు యుద్ధరంగాన్ని తలపిస్తున్నాయి. రెండు జాతీయపార్టీల మధ్య పోరు ఎంతో ఆసక్తిగా ఉంటున్నది. భారాసకూడా ఓటమినుండి త్వరగా కోలుకుని, రెట్టింపు ఉత్సాహంతో విజృంభిస్తున్నది. త్రిముఖ పోటీ తప్పనిసరి అయ్యింది. కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో బలం, బలగం లేని భాజపా తెలంగాణలో భారీ మెజారిటీతో గెలిచేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీ నేతలను కలుపుకొని పోతూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అన్ని పార్టీలు నైతికంగా పతనమవుతుండటం విచారకరం. వ్యక్తిగత దూషణలు, బూతులు ప్రచారాస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు. ప్రజనాడి పట్టే పార్టీ ఏది? అన్నది మాత్రం పెద్ద మిస్టరీ.
శ్రిష్టి శేషగిరి, సికింద్రాబాద్






