22-05-2025 01:30:35 AM
రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలకడంపై విమర్శలు
బెంగళూరు, మే 21: కర్ణాటక రాజధాని బెంగళూరును అకాల వర్షాలు ముంచెత్తాయి. 36 గంటలుగా కురుస్తున్న వర్షాలతో సాధారణ జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం బెంగళూరులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో బెంగళూరు మున్సిపల్ అధికారులు హెబీ ఆర్ లేఔట్లో ఓపెన్ స్టార్మ్ వాటర్ డ్రె యిన్ ఎదుట రెడ్ కార్పెట్‌ను ఏర్పాటు చేయడం విమర్శలకు దారి తీసింది.
ఒక పక్క వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పరామర్శించడానికి వచ్చిన సీఎంకు, డిప్యూటీ సీఎంకు అధికారులు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలకడాన్ని అక్కడున్న వారం తా తప్పుబట్టారు. అధికారుల తీరుపై స్థానికులు సహా బీజేపీ నేతలు ఆగ్ర హం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు వెంటనే రెడ్ కార్పెట్‌ను తొల గించడంతో వివాదం సద్దుమణిగింది.