22-05-2025 01:31:17 AM
-తుమకూరు మెడికల్ కాలేజీలో సోదాలు
-రన్యారావు కేసులో కీలక ఆధారాలు లభ్యం
బెంగళూరు, మే 21: బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టున కన్నడ నటి రన్యారావు వ్యవహారం కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ఈ కేసులో రాష్ట్ర హోంమంత్రి జి.పరమేశ్వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారు లు షాకిచ్చారు.
మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న తుమకూరులోని శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.సోదా ల్లో భాగంగా ఈడీ అధికారులకు కొన్ని కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. రన్యారావుకు, కళాశాలకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు గుర్తించామని.. ఇందులో భాగంగానే కాలేజీకి సంబంధించిన ఆర్థిక రికార్డులను పరిశీలించినట్టు అధికారులు తెలిపారు.
రన్యారావు స్మగ్లింగ్ కేసులో రాజకీయ నేతల హస్తం ఉందనే అనుమానంతో ఇటీవల జరిగిన ఆమె వివాహానికి హాజరైన వ్యక్తులు, సంబంధమున్న రాజకీయ నేతలపై దృష్టి సారించారు. అందుకు సంబంధించిన ఫోటోల్లో సీఎం సిద్దరామయ్యతో పా టు హోంమంత్రి జి. పరమేశ్వర కూడా ఉండడాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి పరమేశ్వరకు చెం దిన కాలేజీపై ఈడీ దాడులు చేయడం ప్రాముఖ్యత సంతరించుకుంది.