22-05-2025 01:28:30 AM
- యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అంగీకారం!
న్యూఢిల్లీ, మే 21: గూఢచార్యం కేసులో జ్యోతిమల్హోత్రా అనే యూట్యూబర్ అరెస్టయిన విషయం తెలిసిందే. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో తనకు సంబంధాలున్నాయని ఆమె తాజాగా అంగీకరించినట్టు తెలుస్తోం ది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల మీడియా సంస్థ వెల్లడించింది. పాక్ హైకమిషన్‌లో పనిచేసే డానిష్ అనే వ్యక్తితో టచ్‌లో ఉండేదాన్నని జ్యోతి పేర్కొంది.
2023లో వీసా కోసం పాక్ హైకమిషన్‌కు వెళ్లినప్పుడు డానిష్‌తో పరిచయం ఏర్పడిందని వెల్లడించింది. పహ ల్గాం దాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయం లోనూ జ్యోతి పాక్‌కు సమాచారం చేరవేసినట్టు అనుమానిస్తున్నారు. పాక్ సరిహద్దుల్లో ప్రభుత్వం బ్లాకౌట్ చేపట్టగా, ఆ సమాచారాన్ని సైతం మల్హోత్రా పాక్‌కు చేరవేసినట్టు భావిస్తున్నారు.
దర్యాప్తు బృందం ఆమె నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఓ ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకుంది. దీంతోపాటు ఆమెకున్న రెండు బ్యాంక్ అకౌంట్‌లను కూడా విశ్లేషిస్తున్నారు. కాగా బుధవారంతో జ్యోతి కస్టడీ ముగిసింది. ఆమెను హిస్సార్ కోర్టులో హాజరుపర్చనున్నారు.