calender_icon.png 15 October, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ శాఖ మొద్దు నిద్ర!

15-10-2025 12:00:00 AM

  1. కండ్లుండీ చూడలేని అధికార యంత్రాంగం 
  2. హద్దులతో ఆక్రమాన్ని వెల్లడించినా కదలని అధికారులు
  3. హైడ్రా విస్తరిస్తేనే వాస్తవాలు 
  4. ఆస్తి పన్ను కట్టినంత మాత్రాన అనుమతులు కాదు 
  5. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : ప్రభుత్వ అవసరాలకు, పేదోడి ఇంటి స్థలాలకు ప్రభుత్వ భూమి కనిపించదు. ఒకవేళ పేదోడు తలదాచుకోవడానికి చిన్న గుడిసె వేస్తే ప్రభుత్వ భూమి అంటూ నేలమట్టం చేస్తున్న రెవెన్యూ అధికారులకు ఆర్థిక అంగ బలం ఉన్న గొప్పోడికి మాత్రం రెడ్ కార్పెట్ వేసి అక్రమాలకు పూర్తి సహా య సహకారాలు అందిస్తుంటారనే ఆరోపణ నూటికి నూరు శాతం హెచ్ కన్వెన్షన్ నిర్మాణంలో తేటతెల్లమైంది.

రో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని పట్టామాటున ఓ మోతుబరి దర్జాగా కబ్జా చేస్తుంటే తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలబడుతున్నాయి. ప్రభుత్వ భూమి ఆక్రమించడమే కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా బవంతులు నిర్మించి దొడ్డిదారిన ఇంటి నెంబర్లు పొంది చక్కగా వ్యాపారం చేస్తూ రూప్ కోట్లు దండుకుంటున్న అటువైపు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవ హరించడం గమనార్హం. అక్రమాలను హద్దులతో సహా విజయక్రాంతి పత్రిక వరుస కథనాలతో వెలుగులోకి బహిర్గతం చేసిన అధికారులు మొద్దు నిద్రలో తోలుతున్నారు. 

పట్టా 817/58.. పొజిషన్ 817/1...

సదరు ఓ ప్రబుద్ధుడు 2016లో 817/58 లో పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన చిలుకూరి వీర భాస్కర్ రెడ్డి వద్ద రెండు డాక్యుమెంట్ల ద్వారా సుమారు 3 భూమిని కొనుగోలు చేశారు. వాస్తవంగా అన్ని సక్రమంగా ఉంటే కొనుగోలు చేసిన వెంటనే పట్టా మార్పు జరుగుతుంది. కానీ సదరు ఆ వ్యక్తికి 2022 వరకు పట్టాదార్ పాస్ పుస్తకం రాలేదంటే ఆ భూమి కొనుగోలులో మతల ఇట్టే అర్థమవుతుంది. దీంతో ఇందిరా కాలనీ సరిహద్దు సర్వేనెంబర్, బసవతారకగాలని సమీపంలోని 817/1 లో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఏకంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేశారు. ఎంత జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదంటే వారి సహాయ సహకారాలు మెండుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. పంచాయతీ అధికారులు ఆ పరదే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉందని, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పంచాయతీ పరిధిలో ఉందని ఎవరికి వారు దాటవేశారు. అంతేకాదు ఆ ఫంక్షన్ హాల్ కు వెళ్లేందుకు పంచాయతీ సర్వేనెంబర్ 61ని ఆక్రమించి రహదారి సైతం ఏర్పాటు చేసుకున్నారంటే ఆ ప్రబుద్ధుడికి అధికారులు రెడ్  కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారనే ఆరోపణ ధ్రువపరుస్తోంది. అధికారులకు 817/58 రికార్డులు చూపుతూ ప్రభుత్వ భూమిలో వ్యాపారం చేస్తున్నాడు. ఒకవైపు ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములు నాళాలు చెరువులు అసైన్డ్  భూములను పరిరక్షిస్తుంటే పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ లో ధనబలం రాజకీయ బలంతో ప్రభుత్వ భూములను కొల్లగొట్టడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ భూమిలో నిర్మించిన భవనాలకు సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా దొడ్డిదారిన 20-1-ఇన్ 0001,20-1-0002 ఇంటి నెంబర్లను పొందారు. భవనాలకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, పంచాయతీల నుంచి ఎలాంటి అనుమతులు పొందకపోవడం గమనార్హం. తమ అక్రమాలు వెలుగు లోనికి రాకుండా ఉండేందుకు సామాజిక సేవ ముసుగులో దందా కొనసాగిస్తున్నాడని ఆరోపణలు వెలబడుతున్నాయి. వాస్త వాలను వెలుగులోకి తీసుకువచ్చే నాలుగో స్తంభంగా పేరు అందిన పాత్రికేయులకు ప్రెస్ క్లబ్ నిర్మాణం చేసి నాల్గోస్తంభాన్ని నేలమట్టం చేశాడంటే అతనే ముందుచూపును తారేఫ్ చేయాల్సిందే. అతని అక్రమాలకు అధికారులే కాదు కొందరు పాత్రికేయులు సైతం సహాయ సహకారాలు అందించేలా వ్యవహరించారంటే అతను మామూలు వ్యక్తి కాదు. 

హైడ్రాన విస్తరించాలి..

ప్రభుత్వ భూముల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రాను విస్తరింప చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఎప్పటికే పట్టణంలో అనేక చెరువులు, నాళాలు కనుమరుగయ్యాయని, ప్రభుత్వ అసైన్డ్ భూములు వేల ఎకరాల్లో కబ్జాకోరుల చేతిలో బందీ అయ్యాయని ఆరోపణలున్నాయి. జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్వంచ పట్టణంలోని ఆక్రమణలపై దృశ్య సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

హెచ్ కన్వెన్షన్ హాలుకు అనుమతులు లేవు 

హెచ్ కన్వెన్షన్ హాలుకు ఎలాంటి అనుమతులు లేవని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత తెలిపారు. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. సదరు ఆ ఫంక్షన్ హాలుకు యజమాని సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా ఇంటి నెంబర్లు పొందారు అనే స్పష్టం చేశారు. సెల్ఫ్ అసెస్మెంట్ చట్టం ప్రకారం అనుమతులు లేకుండా నిర్మించిన వాటికి నూరు శాతం పెనాల్టీ (అపరాధ రుసుం) తో ఇంటి పన్ను వసూలు చేయాలనే నిబంధన ఉందన్నారు. ఆ నిబంధన ప్రకారమే హెచ్చు కన్వెన్షన్ హాలుకు ఎంటి పన్ను వసూలు చేస్తున్నామని, అంతమాత్రాన ఆ ఫంక్షన్ హాలుకు ఆనమత్తులు ఉన్నట్లు కాదని ఆమె స్పష్టం చేశారు.

- మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత