25-09-2025 12:00:00 AM
విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పీనాకపాణి
బెల్లంపల్లి, సెప్టెంబర్ 24 : కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ద్వారా దండకారణ్యంలో సాయుధ పోరాటం చేస్తున్న ఆఖరి మావోయిస్టు వరకు మట్టుపెట్టిన విప్లవ పంథాను మాత్రం నిర్మూలించలేరని విప్లవ రచయితల సంఘం (విరసం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీనాకపాణి అన్నారు. బుధవారం మండలం లోని చంద్రవెల్లి గ్రామంలో ఇటీవల ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం గరియాబంద్ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన జాడి వెంకటి అలియాస్ విమ ల్ సంతాప సభలో ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు.
మూడు దశాబ్దాలకుపైగా విప్ల వోద్యమంలో పాల్గొని బలిదానాల నుండి, చరిత్ర నుండి విప్లవోద్యమ పంథా రూపుది ద్దుకుందన్నారు. అంతిమంగా సాయుధ పోరా టాన్ని అణచివేసినప్పటికీ వర్గ పోరాటం మాత్రం బతికే ఉంటుందని గుర్తుంచుకో వాలన్నారు. సామాజిక కార్యకర్త, సికాస ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన హుస్సేన్ మాట్లా డుతూ మావోయిస్టు పార్టీలో కాంగ్రెస్‌లో చర్చించకుండా 53 ఏళ్ల సాయుధ పోరాట ఉద్యమాన్ని విరమిస్తూ ఆ పార్టీ కేంద్ర కమిటీ పోలేటి బ్యూరో సభ్యులు అభయ్ ప్రకటన విడుదల చేయడం ద్రోహంగానే భావించాల్సి వస్తుందన్నారు.
పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణరావు మాట్లాడుతూ సింగరేణిలో సికాస పోరాటం ఫలితంగా కార్మికులు అనేక హక్కులు సాధిం చుకున్నారని గుర్తు చేశారు. సంతాప సభలో పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొంకురి లక్ష్మణ్, ఉపాధ్యక్షు లు వినోద్, కోశాధికారి వై .పర్వతాలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్య వర్గ సభ్యులు జాగేటి పోశం, అయిందాల సారయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, అమరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మకుమారి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శాంతక్క, న్యూ డెమోక్రసీ నాయకులు చాంద్ పాషా, చంద్రవెల్లి మాజీసర్పంచ్ లక్ష్మణ్ పాల్గొన్నారు.