17-01-2026 12:57:34 AM
సుల్తానాబాద్ జనవరి 1౬ (విజయ క్రాంతి): రేపల్లెవాడ నోము నోముకోవడం ద్వారా కుటుంబాలకు పుణ్యఫలం దక్కుతుందని, ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత ఏర్ప డుతుందని శ్రీ శివాలయం అర్చకులు వల్లకొండ మఠం రమేష్ అల్లుడు హైదరాబాద్ మరకత లింగ దేవాలయం నాగోల్ అర్చకులు పులికాంత మఠం భారత్ శాస్త్రి భక్తు లకు వివరించారు.... భోగి , సంక్రాంతి, కను మ పండుగను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ శివాలయంలో అత్యంత వైభవంగా రేపల్లె వాడ నో ము నిర్వహించడం జరిగినది, ఇందులో పె ద్ద ఎత్తున మహిళలు పాల్గొని నోములతో ప్రత్యేక పూజలు చేశారు, ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ రేపల్లెవాడ రూపంగా పలు చెట్ల స ముదాయాన్ని సమకూర్చినారు, ఈ ఈ సం దర్భంగా ఆలయ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ భరత్ శాస్త్రి శివాని దంపతులను ఘ నంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో అ ర్చకులు మల్ల కొండ మఠం మహేష్ తోపా టు భక్త బృందం పాల్గొన్నారు....