17-01-2026 12:59:30 AM
కరీంనగర్ క్రైం, జనవరి 16 (విజయ క్రాంతి): నగరంలోని 51వ డివిజన్ కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన నేతలు బి.అర్.ఎస్ లో చేరారు. శుక్రవారం నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో బిజెపికి చెందిన నార్త్ జోన్ సెక్రటరీ బండారి ఆంజనేయులు, ఆయన అనుచరులు 50 మంది పార్టీ లో చేరారు. వారికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన గెలుపు కోసం అహర్నిశలు కృషిచేసిన బిజెపి నేతలకు టికెట్లు ఇవ్వకుండా... బిఆర్‌ఎస్ పార్టీలో రిజెక్ట్ చేసిన నేతను పార్టీలో చేర్చుకుని అసలైన కార్యకర్తలకు బండి సంజయ్ అన్యాయం చేశారని అ న్నారు.
దీంతో వారు మనస్తాపం చెంది అసలైన కార్యకర్తలకు బీజేపీలో స్థానం లేదని భావించి ఈ రోజు బీజేపీకి రాజీనామా చేసి బి.అర్.ఎస్ పార్టీలో చేరారని తెలిపారు. తమ హయాంలో చే పట్టిన అభివృద్ధిని కాంగ్రెస్, బీజేపీ అడ్డుకోవడం తప్ప నగర అభివృద్ధికి నయా పైసా నిధులు తేలేదని గంగుల స్పష్టం చేశారు. నగర ప్రజలు కూడా.. కరీంనగర్ ఎవరి హయంలో అభివృద్ధి చెందిందో ఆలోచించాలని కోరారు.
తమ పార్టీలో అవినీతి పరులకు, దొంగలకు చోటు లేదన్నా రు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు మేచినేని అశోక్ రావు, గందె మహేష్ , బోనాల శ్రీకాంత్, ఐలెందేర్ యాదవ్, నాంపల్లి శ్రీనివాస్, జంగిలి సాగర్, దుర్షేడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, కొమ్ము భూమయ్య, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ, అనిల్, మధుకర్ పటేల్, అశోక్, పవన్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.