08-05-2025 12:30:26 AM
వనపర్తి, మే 7 (విజయక్రాంతి) : ప్రతి రైస్ మిల్లు 5000 బస్తాల దొడ్డు వడ్లు ఖచ్చితంగా దించుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు మిల్లర్లను ఆదేశించారు. బుధవారం వనపర్తి మండలంలోని చిట్యాల గోదాము, చీమనగుంట పల్లి లోని స్వామి రైస్ మిల్, నాగవరం లోని పవనపుత్ర రైస్ మిల్లుల్ని అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మిల్లుకు దొడ్డు వడ్లు వస్తె దింపుకొను అని పక్కన పెట్టడానికి వీలు లేదని కచ్చితంగా ప్రతి మిల్లు 5000 బస్తాల దొడ్డు బియ్యం దించుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా వచ్చిన లారీలను పోయించాలని త్వరగా అన్లోడ్ చేసే విధంగా హమాలీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక లారీ పెట్టాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను ఆదేశించారు.