27-05-2025 12:00:00 AM
ఇచ్చోడలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆకస్మిక పర్యటన
ఇచ్చోడ, మే 26 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో గల ప్రధాన కూడళ్ల వద్ద రోడ్డుపై నిల్వ ఉన్న వర్షపు నీటిని తక్షణమే తొలగించి తాత్కాలిక మొరం రోడ్డును పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే పలు కాలనీలకు వెళ్లే రహదారులపై నిల్వ ఉన్న నీటిని పరిశీలించి ప్రజలకు అసౌకర్యంగా ఉన్న నీటిని తక్షణమే తొలగించాలన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకు రావాలని సాధ్యమైనంత త్వరగా మీ సమస్యల పరిష్కారానికి దగ్గరుండి తీరుస్తానని హామీ ఇచ్చారు. వీరి వెం ట మండల కన్వీనర్ కృష్ణ రెడ్డి, మాజీ ఎంపీ పీ ప్రీతం రెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు ముండే పాండురంగ్, మాజీ ఉప సర్పంచ్ శిరీష్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాం త్ రెడ్డి, సాబీర్ ఉన్నారు.