26-05-2025 10:54:15 PM
మునగాల: సూర్యాపేట జిల్లా(Suryapet District) మునగాల మండల పరిధిలోని నరసింహుల గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 2004-2005 వరకు పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ఆవరణంలో సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు ఎం వెంకన్న, జి రమేష్ బాబు, కరుణశ్రీ, ఝాన్సీరాణి, రామాంజమ్మ, ఆర్ బుచ్చిరెడ్డి, ఎం అంజయ్య, భారతి, రెడ్యానాయక్, లామేరి, అనురాధలను ఆహ్వానించి ఆశీర్వాదం పొందారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయుల విద్యాబోధనను, గుర్తుచేసుకొని వారిని కొనియాడారు. తరువాత ఉపాధ్యాయులను పూలమాల శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు కత్తి నాగరాజు, ఎం శివ, ఏ రమేష్, ఆర్ శ్వేత, ఏ ఇందిరా, శైలజ, మహేశ్వరి, రాజేష్, కిరణ్, అమిద్, తదితరులు పాల్గొన్నారు.