calender_icon.png 24 October, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

22-10-2025 12:43:59 AM

కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ, అక్టోబర్ 21 (విజయక్రాంతి): విధి నిర్వహణలో అసువులు బాసిన అమరులకు ఘన నివాళులు.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని కలెక్టర్ రిజ్వన్ బాషా షేక్ అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రఘునాథ్ పల్లి పోలీస్ స్టేషన్లో.. ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.

ముందుగా పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా... విధులను నిర్వహిస్తూ. అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని కలెక్టర్ గుర్తు చేశారు.

విరామం లేకుండా అనునిత్యం పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణే కాకుండా జిల్లా లో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో అలాగే.. అకాల వర్షం వచ్చినప్పుడు.. తదితర సందర్బలల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ అధికారులు భాగస్వామ్యం అవుతున్నారన్నారు. ప్రతి రోజు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ  తమ ప్రాణాలను పణంగా పెట్టీ ధైర్యంగా ముందుకు వెళ్లే పోలీస్ అధికారులు స్ఫూర్తిదయాకమన్నారు. 

పోలీస్ అమరుల త్యాగాలను వృధా కానివ్వకుండా, వారి స్ఫూర్తితో మరింత బాధ్యతాయుతంగా శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయం గా విధు ల్లో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా లో శాంతిభద్రతలు నెలకొని ఉన్నప్పు డే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు.

ప్రస్తుత సమాజంలో మారుతున్న నేర స్వరూపానికి అనుగుణంగా పోలీసులు సైతం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ... అతి తక్కువ వ్యవధిలో ఎంతో చా కచక్యంగా సైబర్ నేరాలను ఛేదిస్తూ, నేరస్థులను పట్టుకుంటున్నారన్నారు. ఈ కార్యక్ర మంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసిపి పండరి చేతన్, ఘన్ పూర్, వర్ధన్నపేట ఏసీపీలు, రఘునాథ్ పల్లి, నర్మెట్ట, వర్ధన్నపేట, పాలకుర్తి, జనగాం సిఐలు, స్టేషన్గన్పూర్ ఎస్హెచ్‌ఓ, తాసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.

భీమదేవరపల్లిలో....

భీమదేవరపల్లి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): విధి నిర్వహణలో అసువులు బాసి న అమరులకు ఘన నివాళులు అర్పించా రు. మండలంలోని సూరారం గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ఎర్రబెల్లి కిషన్ రావు 1991 లో భూపాలపల్లి వద్ద బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయాడు వారి కుటుంబాన్ని సీఐ పులి రమేష్, అక్కనేపల్లి ప్రవీణ్ కుమా ర్, సిబ్బందితో, సూరారం గ్రామానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

వారి తల్లిదండ్రు లు మాధవరావు, కమలమ్మ దంపతులకు నూతన వస్త్రాలు బహుకరించి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగా లు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని అన్నారు.తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధుల ను నిర్వహిస్తూ , అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత గుర్తు చేశా రు.

విరామం లేకుండా అనునిత్యం పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణే కాకుండా వి విధ అభివృద్ధి కార్యక్రమాలలో అలాగే అకా ల వర్షం వచ్చినప్పుడు తదితర సందర్భాల్లోప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా పోలీస్ అధికారులు భాగస్వామ్యం అవుతున్నారన్నారు. ప్రతి రోజు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ  తమ ప్రాణాలను ఫణంగా పెట్టీ ధైర్యంగా ముందుకు వెళ్లే పోలీస్ అధికారులు స్ఫూర్తిదయామన్నారు. ఈ కార్యక్ర మంలో పోలీస్ సిబ్బందితో కానిస్టేబుల్ విఠల్రావు, బక్కయ్య, శ్రీధర్, పలువురు నాయకులు పాల్గొన్నారు.